Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కమిటీసభ్యులు తుమ్మల పద్మ
నవతెలంగాణ-నల్లగొండ
మహిళలు సంఘటిత శక్తిని పెంచడానికి ఘనంగా వాడ వాడలా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని సీపీఐ(ఎం) జిల్లాకమిటీ సభ్యురాలుతుమ్మల పద్మ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సీపీఐ(ఎం) 42 వార్డు ఆర్టీసీ కాలనీ శాఖ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించి మాట్లాడారు. మహిళలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడం కోసం వంటింటికే పరిమితం కాకుండా సమాజంలో జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకోవడం మహిళలపై జరుగుతున్న అగత్యాలకు వ్యతిరేకంగా నిలబడడం కోసం చైతన్యం కల్పించడానికి సీపీఐ(ఎం) కృషి చేస్తుందన్నారు. పండుగ సందర్భంగా మహిళలంతా ఒకచోట కూడి ఆనందంగా రంగవల్లులు వేసి తమ ప్రతిభ కనబరిచిన వారిని అభినందించారు. ఈ కార్యక్రమానికి బహుమతులు దాత గార్లపాటి శ్రీనివాస్‌రెడ్డి జ్ఞాపకార్థం ఆయన సతీమణి పద్మ బహుమతులు అందజేశారు. న్యాయనిర్ణేతలుగా చిన్నపాక మంజుల, భూతం అరుణకుమారి, వ్యవహరించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు పాల్గొన్న వారందరికీ కన్సొలేషన్ బహుమతులు అందజేశారు. ప్రధమ బహుమతి బీ. క్రాంతి, ద్వితీయ బహుమతి జీ.మమత, తృతీయ బహుమతి శివాని, గెలుపొందారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నన్నూరు వెంకటరమణారెడ్డి, సీనియర్ నాయకులు అనంతుల శంకరయ్య, పట్టణ కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, ఊట్కూరు మధుసూదన్‌రెడ్డి, భూతం అరుణకుమారి, శాఖ సహాయ కార్యదర్శి మాటూరు సునీత, చినపాక మంజుల, మాటూరి నరేందర్, మమత, శివాని, సహస్ర, మహిళలు పాల్గొన్నారు.