Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామాల వికాసానికి ప్రజాప్రతినిధులు పాటుపడాలి
- వైకుంఠ ధామం ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు
నవతెలంగాణ-మిర్యాలగూడ, మిర్యాలగూడ రూరల్
గ్రామాల సమగ్రాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్‌రావు తెలిపారు. ప్రజాప్రతినిధులు, సర్పంచులు ప్రజలతో కలిసి గ్రామాల వికాసానికి పాటుపడాలని ఆకాంక్షించారు. మండల పరిధిలోని చింతపల్లి గ్రామంలో రూ.12 లక్షల 60వేలు నిధులతో సకల సౌకర్యాలతో నిర్మించిన అధునాతన వైకుంఠ ధామాన్ని భాస్కర్‌రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పల్లెల్లో ప్రగతి విప్లవం కోసం సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధితో పాటు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. రాష్ట్రంలోని పల్లెలు బాగుపడాలనే సంకల్పంతో నాలుగేండ్ల ప్రణాళికకు సరిపడే విధంగా రూ.39,594 కోట్ల నిధులు కేటాయించారని చెప్పారు. వైకుంఠ ధామాల నిర్మాణం కోసం మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం నుంచి నిధులు కేటాయిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మెన్ తిప్పన విజయసింహారెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ నూకల సరళ హన్మంత్‌రెడ్డి, మండల రైతు బంధుసమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, సర్పంచ్ బానావత్ లలిత సక్రునాయక్, జంకుతండా సర్పంచ్ రవీందర్‌నాయక్, ఎంపీటీసీ ధీరావత్ లక్ష్మీ తులసీ రామ్, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, రాంరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు పల్లపు వెంకట రాములు, బొడ్డు నందకిషోర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.