Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
పనికి తగిన పారితోష్కాలతో వెట్టి చాకిరి చేయించుకుంటున్న ఆశా వర్కర్లకు కంటి వెలుగు కార్యక్రమానికి పారితోషికం నిర్ణయించి అమలు చేయాలని సీఐటయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నల్లగొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అనిమల్ కొండలరావు, లైన్ వాడ, మాన్యం చెల్క, పానగల్లు అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో ఆశలను ఉపయోగించుకోవడానికి నిర్ణయించడం అభినందనీయమని అన్నారు. ఆశా కార్యకర్తలకు ఎలాంటి ఫిక్స్డడు వేతనం లేదు. ఇప్పటికే పారితోషకాలు లేని అనేక రకాల పనులు చేయిస్తున్నారన్నారు. పనికి తగిన పారితోషికాల పేరుతో ఇస్తున్నందున కంటి వెలుగు కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్న ఆశా వర్కర్లకు పారితోషికాలు నిర్ణయించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఏఎన్ఎంలకు టీిఏడీఏలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివిధ ప్రాంతాల్లో వేరువేరుగా ఇచ్చిన వినతి పత్రాల కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పోలే సత్యనారాయణ, ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు నళిని, సువార్త, పాల్గొన్నారు.
నాంపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 18 నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమంలో భాగస్వాములై విధులు నిర్వహించే ఆశా కార్యకర్తలకు అదనపు పారితోషికం ఇవ్వాలని శుక్రవారం నాంపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్స్‌కు ఆశా కార్యకర్తలు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి మెగావత్ సునీత, కొరె లలిత, ఏ.సునీత, ఏ.కవిత, తదితరులు పాల్గొన్నారు.
మర్రిగూడ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 18 నుండి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో ఆశా వర్కర్లకి అదనంగా పారితోషికం చెల్లించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య శుక్రవారం మర్రిగూడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యాధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకొని కంటి వెలుగులో ఆశ వర్కర్ల వేతనంపై వివరణ ఇవ్వాలని కోరారు.