Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18 నుండి ప్రారంభిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి వార్డు నుండి 18 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకొని ఉచితంగా మందులు, కళ్లద్దాలు పొందాలని మున్సిపల్ కమిషనర్ కేవీ.రమణాచారి అన్నారు. సోమవారం మున్సిపల్ సమావేశం మందిరంలో ఆశా కార్యకర్తలు, ఆర్పీలు, వార్డ్ ఆఫీసర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని ఈనెల 18 న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన అనంతరం 19న నల్గొండ మున్సిపాలిటీలో కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలిపారు. వందరోజుల కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. పట్టణంలో ఉన్న 48 వార్డులలో కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని పేర్కొన్నారు. ప్రతి వార్డులో 10 రోజుల కార్యక్రమం ఉంటుందని, ప్రతిరోజు 150 మందికి స్క్రీనింగ్ చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్ణయించినట్లు తెలిపారు. నల్లగొండ పట్టణంలో కార్యక్రమం 19వ తేదీన ప్రారంభమై జూన్ 27వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం గురించి మరోసారి సమావేశం నిర్వహించి కార్యక్రమం విజయవంతం చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ రాములు, డీఈ అశోక్, ఏసీపీ ప్రసాద్, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.