Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో భారీ ఎత్తున నిర్వహించనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు యువకులు స్వచ్ఛందంగా తరలివచ్చి సభను జయప్రదం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం నాంపల్లి మండలానికి వెళుతూ మార్గమధ్యంలో చిట్యాల మండలంలోని పేరేపల్లి గ్రామంలో ఆయన కాసేపు ఆగి గ్రామంలోని యువకులతో మాట్లాడారు. ఖమ్మం సభకు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు స్వచ్ఛందంగా తమ సొంత వాహనాలలో రావాలని కోరారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు యువకులు తోడ్పాటు అందించాలని, ఆయన చేసే అభివృద్ధి పనులలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ సర్పంచ్ కొలను సతీష్‌గౌడ్, నాయకులు కొలను వెంకటేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.