Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునగాల
గరిడేపల్లి మండలం కీతవారిగూడెం నుండి కొక్కిరేణి మీదుగా మునగాల వరకు గల ఆర్ అండ్ బీ రోడ్డు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేదరమట్ల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం రోడ్డు విస్తరణ పనులను సీపీఐ(ఎం) బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆధ్వర్యంలో చేసిన అనేక పోరాటల ఫలితంగా రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని గుర్తుచేశారు. రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగవంతం చేయాలని కోరారు.రోడ్డు నిర్మాణం పూ ర్తయితే నాల్గు మండలాల్లో ని15 గ్రా మాల ప్రజలకు సౌకర్యం కలుగుతుందని చెప్పారు. మండలంలోని గణపవరం బ్రిడ్జి నిర్మాణానికి అదనపు నిధులు కే టాయించాలన్నారు. రోడ్డు విస్తరణకు పనులకు ఆయా గ్రామాల ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు, దళిత ఇండియన్సి చాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్ ఇండిస్టీ( డిక్కీ) జిల్లా అధ్యక్షులు కొండమీది గోవిందరావు, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు మిట్టగణ్పుల ముత్యాలు, పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి నందిగామ సైదులు, మండల కమిటీ సభ్యులు రేఖ లింగయ్య, కొక్కి రేణి గ్రామ ఉప సర్పంచ్ రావులపెంట బ్రహ్మం, మాజీ సర్పంచ్ రావులపెంట వెంకన్న, నాయకులు నిడిగొండ శంభ య్య, ఇంటూరు హుస్సేన్, ఒట్టెపు చిన్న సైదులు, పాల్గొన్నారు.