Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజేతలకు మంత్రి జగదీశ్‌రెడ్డి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం
నవతెలంగాణ-సూర్యాపేట
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సోమవారం స్థానిక 45 వ వార్డులో నివాసాల ముందు 350 మంది మహిళలు ముగ్గులు వేశారు.కాలనీలో ప్రతి ఇంటికి తిరిగి మహిళలు వేసిన ముగ్గులను పరిశీలిస్తూ వారి వారి ఇండ్ల వద్ద మహిళలకు వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్,జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు అప్పం శ్రీనివాసరావులు చీరలను బహుమతులుగా అందజేశారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు అప్పం శ్రీనివాసరావులు మాట్లాడుతూ కాలనీలో ముగ్గుల పోటీలలో పాల్గొన్న 350 మంది మహిళలకు వారి ఇండ్ల వద్ద బహుమతిగా జి షాపింగ్ మాల్ వారిచే ప్రతి ఒక్కరకి చీరలను అందజేసినట్లు చెప్పారు. ముగ్గుల పోటీలలో విజేతలైన వారికి ప్రధమ, ద్వితీయ, తృతీయ కన్సొలేషన్ బహుమతులను మంగళవారం నాడు వార్డులో జరిగే కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అందజేస్తారని తెలిపారు. మొదటి బహుమతి రూ.10 వేల పట్టుచీర, రెండో బహుమతి రూ.7500 విలువ కలిగిన పట్టుచీర, మూడవ బహుమతి రూ.5000 విలువ చేసే పట్టు చీర ఇంకా పది కన్సోలేషన్ బహుమతులు రూ.1000 విలువ గల చీరలను మంత్రి జగదీష్‌రెడ్డి చేతుల మీదుగా అందజేస్తామని వారు వివరించారు . ఈ కార్యక్రమంలో జిల్లా బిఆర్ ఎస్ పార్టీ నాయకులు గండూరి క్ర్రపాకర్, మాజి కౌన్సిలర్ సయ్యద్ సలీం, నూకల వెంకట రెడ్డి, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు మిట్టకోల యుగంధర్, జిల్లా నాయకులు పిషిక వీరయ్య,యువజన నాయకులు కొంగరి ఉపేందర్, పున్న వెంకన్న, వొవాల్ దాస్ జగదీష్, డాక్టర్ శిరీష, డాక్టర్ ప్రమీల, డాక్టర్ దుర్గా భాయ్, రాచకొండ శ్రీనివాస్, గుడగంట్ల విద్యాసాగర్, గుడగుంట్ల లక్ష్మి, తెరటపల్లి సతీష్, బెజగం ఫణింద్ర, మిట్టపల్లి రమేష్, వుల్లి రామాచారి పాల్గొన్నారు.