Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
నిజామాబాద్ జిల్లాలో కోటగిరి గ్రామంలో టీచర్ మల్లికార్జున్‌పై దాడి చేసిన బీజేపీ రౌడీమూకలను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ నేడు జిల్లాలో జరిగే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.సోమవారం స్థానిక సీఐటీయూ జిల్లా కార్యాలయంలో సీఐటీయూ-253 డైరీని పెయింటర్ వర్కర్స్ యూనియన్ నాయకులకు అందజేస్తూ ఆయన మాట్లాడారు.మల్లికార్జున్‌ను కులం పేరుతో దూషించి గుడిలో తీసుకపోయి బొట్టు పెట్టీ విధుల్లో తిప్పి కొట్టి అవమానపర్చిన బీజేపీ రౌడీమూకలను వెంటనే అరెస్టు చేసి కటినంగా శిక్షించాలని కోరారు.ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగు నిరసనలో భాగంగా జిల్లాలోని అన్ని మండలాల్లో పట్టణాలలో నిరసన కార్యక్రమాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కులం పేరుతో ఘోరంగా అవమానపరిచిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు వెంటనే నమోదు చేయాలని దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.వినాయక పండగకు చందాలు ఇవ్వలేదని కారణంతో మల్లికార్జున్‌పై కక్ష పెంచుకొని అదును చూసి ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.ఈ కార్యక్రమంలో పెయింటర్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు పేరాల వెంకన్న, వీరన్న, నరేష్ పాల్గొన్నారు.