Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
పట్టణంలోని రామలింగేశ్వర టాకీస్ రోడ్ నందు గల రెడ్ బకెట్ బిర్యానీ షాపును మున్సిపల్ అధికారులు సోమవారం సీజ్ చేశారు.షాపులో ఉన్న రెడ్ బకెట్ లో బిర్యానీ కొనుగోలు చేసిన సాయి రామ్ అనే ఓక కస్టమర్ బిర్యానీ తినే సరికే వాంతులు అయ్యాయి.ఈ నేపథ్యంలో మున్సిపల్ కమీషనర్ పి.రామానుజుల రెడ్డి కి బాధితుడు పిర్యాదు చేశాడు.దీంతో కమిషనర్ ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్ ,జనార్దన్ రెడ్డి, సిబ్బంది కొండేటి వెంకన్న ,పిడమర్తి ప్రసాద్ ,రాజేష్ లు షాప్ ను పరిశీలించారు.కాగా షాపులో చికెన్ వాసన వస్తుండటం తో వెంటనే వారు షాపును సీజ్ చేశారు. పట్టణంలో ఎవరైనా ఇలాంటి సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.