Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంఘం జిల్లా అధ్యక్షులు బొమ్మిడి లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-సూర్యాపేట
ఈనెల 21 న హైదరాబాదులోని రవీంద్ర భారతిలో 1969 తొలి ఉద్యమకారుల సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు బొమ్మిడి లక్ష్మీనారాయణ అన్నారు.సోమవారం జిల్లాకేంద్రంలోని సూర్యాపేట కిరాణా మర్చంట్ అసోసియేషన్ నందు నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.1969లో ప్రత్యేక రాష్ట్ర సాధనకై ప్రజా ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి, 2001లో కేసీఆర్ సారథ్యంలో మలిదశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనకై కషిచేసిన 1969 ఉద్యమకారులను స్వతంత్య్ర సమరయోధులుగా గుర్తించాలని పేర్కొన్నారు. అర్హులైన వారికి స్వతంత్ర సమరయోధులుగా గుర్తించి పెన్షన్ మంజూరు చేయాలని కోరారు.ఆరోగ్య, ఆహారభద్రత కార్డులను మంజూరు చేయాలని కోరారు.బస్సు, రైలు ప్రయాణాలలో రాయితీ కల్పించాలన్నారు.తొలి ఉద్యమకారుల సంఘం అనేక ఉద్యమాలు చేసినప్పటికీ న్యాయం జరగడం లేదన్నారు.కావున రవీంద్ర భారతిలో జరుగు సమావేశానికి తొలి ఉద్యమకారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో జిల్లా గౌరవాధ్యక్షులు నీలకంఠ చలమంద, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతారాంరెడ్డి, జిల్లా నాయకులు సీహెచ్.విశ్వేశ్వర్రావు, ఎస్ఏ హమీద్ ఖాన్, కె.వెంకటేశ్వర్లు, డి.కిషన్‌నాయక్, గెల్లి సత్యనారాయణ, రంగయ్య, డి.సత్యనారాయణ, ఎన్.రామచంద్రారెడ్డి, గాజుల సత్తయ్య, లక్ష్మి, రుద్రమ, భద్రమ్మ ,రాజమ్మ, శాంతమ్మ, కళమ్మ, పెద్దన్న నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.