Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
దేశానికి వెన్నెముకగా కీర్తించబడుతున్న రైతన్నలను వాసవి క్లబ్,వాసవి వనితా క్లబ్ ఘనంగా సన్మానించింది. మూడు రోజుల సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని సోమవారం కనుమ పండుగ సందర్భంగా మండలానికి చెందిన రైతులు దొంతిరెడ్డి పెదరామిరెడ్డి, ఒగ్గు సైదులు,గుండెబోయిన వెంకన్న, మలిగిరెడ్డి సైదిరెడ్డి, పోరెడ్డి శ్రీరామ్‌రెడ్డి, గుర్రం జాన్రెడ్డిలను పట్టు శాలువాలతో ఘనంగా సన్మానించారు.వారు చేస్తున్న సేవలను కీర్తించారు.ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ గరిణె అరుణ, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ రాచకొండ విజయలక్ష్మి, వాసవి వనితా క్లబ్ అధ్యక్షులు కొత్తా లక్ష్మణ్ వీరవల్లి శ్రీలత కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గజ్జల కోటేశ్వరరావు, కోశాధికారులు యీగా భాగ్యలక్ష్మి, పోలిశెట్టి అశోక్, సోమప్ప దేవాలయ చైర్మెన్ రాచకొండ శ్రీనివాసరావు, మాజీ జోన్ చైర్మెన్ కందిబండ శ్రీనివాసరావు, ఆర్యవైశ్యసంఘం పట్టణ మహిళా అధ్యక్షురాలు కందికొండ వాసంతి, వాసవి, వనిత క్లబ్ సభ్యులు మురారిశెట్టి రమేష్, ఊటుకూరు నటరాజ్, పాల్వాయిగోపాలకృష్ణ, భువనగిరి అంజయ్య, పరమేశం, కళావతి, సువర్ణ, పద్మ, నరసకుమారి, సంధ్య, ధనలక్ష్మి పాల్గొన్నారు.