Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-కోదాడరూరల్
ఈనెల 18 న ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మంలో జరిగే సభ దేశ రాజకీయాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతుందని, దేశ ప్రజల కోరిక మేరకు కేసిఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించడం జరిగిందన్నారు.రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అందించే నిధుల్లో తీవ్ర వివక్ష ఉందని, నరేంద్ర మోడీ దుర్మార్గపు పాలన చేస్తున్నారని, అడిగే వారే లేరు అన్నట్లు మోడీ అహంకారంతో వున్నాడు అని,తెలంగాణ బాగుపడుతుంటే ప్రధాని నరేంద్ర మోడీ అడ్డుపడుతున్నాడు ఘాటుగా విమర్శించారు. తెలంగాణను విద్యుత్ వెలుగులు వెదజల్లే విధంగా కేసీఆర్ ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బొల్లం మల్లయ్యయాదవ్, జిల్లా ఇన్చార్జి ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు, ఎంపీపీ చింతా కవితా రాధారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పద్మ, తదితర ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.