Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
ప్రతిరోజూ ఉదయం 8.45గంటలకే కంటి వెలుగు బృంద సభ్యులు క్యాంపు ప్రదేశానికి చేరుకోవాలని కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు.సోమవారం రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు ఖమ్మం కలెక్టర్ కార్యాలయం నుంచి , రాష్ట్ర సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనికుమార్ వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ రిజ్వి, కమిషనర్ శ్వేత హైదరాబాద్ బీఆర్కే భవన్ నుంచి కంటి వెలుగు క్యాంపుల నిర్వహణ పట్ల తీసుకోవాల్సిన చర్యల పై అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్యాంపులకు అందించిన సామగ్రిని పరిశీలించి సర్టిఫై చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో నియోజకవర్గాల వారీగా క్యాంపుల నిర్వహణ షెడ్యూల్ సంబంధిత ప్రజాప్రతినిధులకు ముందుగానే అందజేయాలని సూచించారు. కంటి వెలుగు క్యాంపుల నిర్వహణ సమయంలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా, సిబ్బందికి మంచినీరు, భోజనాలు సరఫరా చేయాలని తెలిపారు.జిల్లాలో కంటి వెలుగు క్యాంపుల షెడ్యూల్ తెలియజేస్తూ అవసరమైన భద్రత కల్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో,కుటుంబ సంక్షేమ సంచాలకుడు జి. శ్రీనివాస్, ఎస్పీ రాజేంద్రప్రసాద్, డీఎంహెచ్ఓ కోటాచలం, డీపీఓ యాదయ్య, వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.
'కంటి వెలుగు'ను విజయవంతం చేయాలి
ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి
కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్
జిల్లాలో ఈ నెల 18 నుండి చేపట్టబోయే కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ యస్.మోహన్‌రావుతో కలిసి కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణపై ప్రత్యేక అధికారులు, వైద్యాధికారులతో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పాల్గొని దిశ నిర్దేశ్యం చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ కంటి వెలుగు నిర్వహణకై జిల్లాలో 50 టీంలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.మరో 3 టీంలను బఫర్ రిజర్వ్డ్గా అందుబాటులో ఉంచామని తెలిపారు.ఈ నెల 18 నుండి జూన్ 30 వరకు చేపట్టే కంటి వెలుగు కేంద్రాలలో ప్రభుత్వ నిబంధనల మేరకు మౌలికవసతులు కల్పిస్తామన్నారు.ప్రతి క్యాంప్‌లో ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, ఎక్కడికక్కడ సమస్యలు ఉత్పన్నం కాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కంటి వెలుగుపై ముందుగా ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఆహ్వానపత్రాలు, కరపత్రాలు అందచేసి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.కేంద్రాలలో పరీక్షల కోసం వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని ఆదిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రతి టీంలో 8 మంది సభ్యులు ఉంటారన్నారు. గ్రామ స్థాయిలో రోజుకు 125 మంది అలాగే పట్టణాల్లో 160 మందికి కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పనిదినాలలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కేంద్రాలు పనిచేస్తాయని తెలిపారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రత్యేక అధికారులు, వైద్యాధికారులు సమన్వయంతో కలసి పనిచేయాలని సూచించారు.ప్రత్యేక అధికారులు కేంద్రాలను ముందుగా తనిఖీ చేసి నివేదికలు అందచేయాలన్నారు.గ్రామ, మున్సిపల్ ప్రాంతాలలో 616 కేంద్రాలలో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం, కోదాడ ఆర్డీఓ కిషోర్‌కుమార్, జిల్లా అధికారులు, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండకలెక్టరేట్ : కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధుల సహకారంతో విజయవంతంగా అమలు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టీ. హరీష్‌రావు అన్నారు. మంత్రి సోమవారం ఖమ్మం కలెక్టర్ కార్యాలయం నుంచి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రిజ్వి, కమిషనర్ శ్వేతలు హైదరాబాద్ బీఆర్కె భవన్ నుంచి కంటి వెలుగు క్యాంపుల నిర్వహణ పట్ల తీసుకోవాల్సిన చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ టీ.వినరు కృష్ణారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ ఖుష్భుగుప్తా, అదనపు ఎస్పీ కేఆర్కే.ప్రసాద రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్. అనిమల్ల కొండల్ రావు, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవీ.రమణాచారి, డీఆర్డీఓ పీడీి. కాళిందిని, డీపీఓ.విష్ణువర్ధన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.