Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల ఆధ్వర్యంలో వాహనాలు అడ్డగింత
నవతెలంగాణ-చింతపల్లి
రైతుల భూముల నుంచి ఐఎంఆర్ ఆగ్రోవిట్ కంపనికి అక్రమ దారికి కంపెనీ వాహనాలు వెళ్లకుండా చర్యలు చేపట్టాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఉడుగుంట్ల రాములు డిమాండ్ చేశారు. కంపెనీ దారికి రైతులు కోల్పోయిన భూమికి నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని అన్నారు. సోమవారం చింతపల్లి మండలంలోని పోలేపల్లి గ్రామ రెవెన్యూ సర్వేనెంబర్ 240, 224 మధ్య భూములలో రైతుల భూముల రైతులు వెళ్లనికే చేసుకున్నటువంటి దారి నుండి రంగారెడ్డి జిల్లాలో ఉన్న కంపెనీ వాహనాలు ఎలా వెళ్తాయని అసలు రంగారెడ్డి జిల్లాలో ఉన్న కంపెనీకి నల్లగొండ జిల్లా నుండి రహదారి పొలాల నుండి ఎలా వెళ్తారన్నారు. సీపీఐ(ఎం) మండల కార్యదర్శి, రైతులు తమ పొలాల గుంట వాహనాలు వెళ్లకుండా పండగ పూట అడ్డగించి పోలీస్ స్టేషన్లో కంపెనీ యజమానిపై, బండ్లపై కేసు నమోదు చేయమని దరఖాస్తు సమర్పించారు. రైతులకు న్యాయం జరగపోతే కంపెనీ వాహనాలు వెళ్లకుండా చావనైనా చస్తాం కానీ ఇక్కడ నుంచి కంపెనీ వాహనాలు పోనివ్వమని రైతులు హెచ్చరించారు. వృద్ధ రైతులను ఇబ్బంది పెడితే సీపీఐ(ఎం) పక్షాన వారికి అండగా నిలుస్తామని తెలిపారు. ఆయన వెంట రైతులు పడకంటి నారయ్య, పడకంటి బక్కయ్య, పడకంటి వీరమ్మ, పడకంటి యాదయ్య, పడకంటి కృష్ణయ్య, పడకంటి మాదర్, దున్నబాలకృష్ణ, నితిన్ ఉన్నారు.
మంత్రి కేటీఆర్కు ట్వీట్
అక్రమంగా రైతుల భూముల నుండి కంపెనీకి వెళ్లే వాహనాలు వెళ్లకుండా ఆపాలని రైతుల ఆవేదన వ్యక్తం చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోవడంతో మంత్రి కేటీఆర్కు ట్విట్టర్లో వినతిని ట్వీట్ చేసినట్టు రైతులు తెలిపారు.