Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భూదాన్ పోచంపల్లి
పురపాలక కేంద్రంలోని శాంతినికేతన్ పాఠశాలకు చెందిన 2010-11 బ్యాచ్‌కు చెందిన పదవ తరగతి పూర్వవిద్యార్థుల సమ్మేళనం మంగళవారం జిబిఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆధ్యాపకులను శాలువా మెమొంటోతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పాఠశాల విద్యను అభ్యసించినట్టయితే ఉన్నత స్థాయికి ఎదుగుతారన్నారు. ఉపాధ్యాయులు నేర్పిన అక్షరాభ్యాసమే విద్యార్థి భవిష్యత్తుపై ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ దామోదర్ రెడ్డి ఉపాధ్యాయులు తిరుమలరెడ్డి అశోక్ లతా పవిత్ర విద్యార్థులు నరేందర్ దినేష్, శ్రీకాంత్, సందీప్ రెడ్డి, శేఖర్ రెడ్డి ,మాధవరెడ్డి, శ్రీను ,వెంకటేశం, శిరీష, ప్రియాంక, స్వాతి, శైలజ, శ్రావ్య సరిత, భావన, ఉష ,మమత ,పాల్గొన్నారు .
మోత్కూర్ : మోత్కూర్ లోని వివేకానంద విద్యామందిర్ ఉన్నత పాఠశాల 2002-03 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం మంగళవారం మోత్కూర్ లోని ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ లో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి స్నేహితులంతా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తమకు చదువు చెప్పిన గురువులు నాగవెల్లి జయశ్రీ, రాజ్యలక్ష్మి, భార్గవ్ రామ్, గజ్జి మల్లేశం, రామచంద్రు, వెంకటేశ్వర్లు, రమేష్, ఆనంద్ లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.