Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
పురపాలక సంఘంలో మంగళవారం 9వ వార్డులో అభివృద్ధి పనులను మంగళవారం మున్సిపల్చైర్మెన్ వస్పరి శంకరయ్య వార్డు కౌన్సిలర్ మోర్తల సునీతరమణారెడ్డి ప్రారంభించారు. కమిటీ కరీ ఉపేందర్ ఇంటి నుండి మైల బోయిన వినోద్ ఇంటి వరకు, నాలేర్ పట్టణ అభివృద్ధి నిధులు , ప్రభుత్వ విప్, శాసన సభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, ప్రత్యేక నిధులు ఎస్ డి ఎఫ్, 20 లక్షల నిధులనుండి సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్.పంచాయతీరాజ్ ఏఈ అనిల్, 3వ వార్డ్ కౌన్సిలర్ బేతి రాములు, పత్తి వెంకటేష్, పూల శ్రవణ్, ముదిగొండ శ్రీకాంత్, ఆలేటి అనిల్ , కటకం బాలరాజ్, మహిళ బోయిన వినోద్, కాలనీవాసులు పాల్గొన్నారు.