Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోత్కూర్ మార్కెట్ చైర్మెన్ యాకూబ్ రెడ్డి
నవతెలంగాణ-మోత్కూర్
ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభను ప్రజలు విజయవంతం చేసి కేసీఆర్ ను దేశ రాజకీయాల్లోకి పంపాలని మోత్కూర్ మార్కెట్ కమిటీ చైర్మెన్కొణతం యాకూబ్ రెడ్డి అన్నారు. మంగళవారం మార్కెట్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభించినప్పుడు సిద్దిపేట ప్రజలు దీవించి కేసీఆర్ ను పంపడంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, అదే స్ఫూర్తితో దేశ రాజకీయాల్లో రాణించి తెలంగాణ సత్తా చాటేలా రాష్ట్ర ప్రజలు కేసీఆర్ ను దీవించాలని కోరారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, జరుగుతున్న అభివద్ధితో భారతదేశ ప్రజలు తెలంగాణ వైపు ఆకర్షితులై చూస్తున్నారని, అదే తరహా అభివద్ధి, సంక్షేమాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. దేశంలో అసమర్థ పాలకుల కారణంగా దశాబ్దాలుగా జరగని మార్పు కోసం భారత రాష్ట్ర సమితితో సీఎం కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించడంతో బీజేపీ ఇతర పార్టీల నాయకుల్లో వణుకు ప్రారంభమైందని తెలిపారు. బుధవారం ఖమ్మంలో ఐదు లక్షల మందితో నిర్వహించే భారీ బహిరంగ సభకు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ నాయకత్వంలో మోత్కూరు మండలం నుంచి 3వేల మంది ప్రజలు తరలివెళ్లనున్నారని, అందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని చెప్పారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్, మున్సిపాలిటీ అధ్యక్షుడు బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి, ప్రధాన కార్యదర్శి గజ్జి మల్లేష్, మాజీ ఎంపీటీసీ జంగ శ్రీను, కౌన్సిలర్ వనం స్వామి, ఆరెగూడెం గ్రామశాఖ అధ్యక్షుడు కొణతం మహేందర్ రెడ్డి ఉన్నారు.