Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కోశాధికారి దోనూరు నర్సిరెడ్డి
నవతెలంగాణ- సంస్థాన్‌నారాయణపురం
కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని సీఐటీయూ జిల్లా కోశాధికారి దోనూరు నర్సిరెడ్డి విమర్శించారు. మంగళవారం మండల కేంద్రంలోని అమరవీరుల స్మారక భవనంలో నెల్లికంటి జంగయ్య అధ్యక్షతన నిర్వహించిన ఆ సంఘం అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం మండల శాఖ సమావేశంలో ఆయన మాట్లాడారు.కార్మికులు పోరాడి గత పాలకుల మీద సాధించుకున్న 44 కార్మిక సంక్షేమ చట్టాలను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నాలుగు కోడలుగా విభజించి కార్మికుల చెమటను దోచుకుం టుందన్నారు. రోజుకు 8గంటల పని విధానాన్ని 12గంటలకు పెంచి కార్మికుల శ్రమను దోచుకుం టుందన్నారు. అందమైన మేడలు నిర్మించే భవన నిర్మాణ కార్మికులకు సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పని ప్రదేశంలో జరిగి ప్రమాదంలో అనేకమంది కార్మికులు అంగవైకల్యం చెందినా ఆర్థిక సాయం అందించడంలో పాలక వర్గాలు నిర్లక్ష్యం చేస్తున్నా యన్నారు. 50 సంవత్సరాలు పైబడ్డ కార్మికులందరికీ నెలకు రూ.5వేలు పెన్షన్ వర్తింపజే యాలన్నారు.ప్రతి కార్మికునికి ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎన్. జంగయ్య,దోసర్ల ఆంజనేయులు,కడ్తాల శంకరయ్య, క.గాలయ్య, ఆర్ స్వామి,ఎస్ యాదయ్య,ఎం వెంకటయ్య,ఎస్ నరసింహ, ఆర్ లింగయ్య,ఇ.మల్లేష్, పి.చంద్రయ్య, ఎన్. సుమన్ తదితరులు పాల్గొన్నారు.