Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బొమ్మలరామారం
మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు అన్నారు.మండల కేంద్రంలో మంగళవారం సల్లూరి కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలాన్ని అభివృద్ధి చేయడంలో, ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. హైదరాబాదుకు కూత వేటు దూరంలో ఉన్న మండల కేంద్రంలో బస్టాండ్ లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి ర్యకలశ్రీశైలం, నాయకులు బ్రహ్మచారి, లక్ష్మయ్య ,ఎల్లయ్య, రమేష్ ,ఎల్లయ్య, నరసింహ, పున్నమ్మ, తదితరులు పాల్గొన్నారు.