Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అద్యక్ష,కార్యదర్శులు కల్లూరి మల్లేశం, కొమటిరెడ్డి చంద్రారెడ్డి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
మల్లికార్జున్ టీచర్ను కులం పేరుతో దూషించిన వారిపై ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని, నిందితులను అరెస్టు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కల్లూరి మల్లేశం,కొమటిరెడ్డి చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. సీఐటీయూ అధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ వారు మాట్లాడుతూ నిజామబాద్ జిల్లా కోటగిరిలో దళిత టీచర్ మల్లికార్జున్ ని కులం పేరుతో దూషిస్తూ ,అతన్ని అవమానిస్తూ, బలవంతంగా దేవుడు గుడికి తీసుకెళ్ళి బొట్టు పెట్టించి గ్రామ విధుల్లో ఊరేగించి,అనాగరిక చర్యలకు పాల్పడిన ఆర్ఎన్ఎస్ , బీజేపీమతోన్మాద దుండగులను తక్షణమే అరెస్ట్ చేసి కులం పేరుతో దూషించినందున ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాద్యక్షులు యండి పాషా, జిల్లా సహాయకార్యదర్శి బోడ భాగ్య , జిల్లా నాయకులు రాధారపు మల్లేశం, కలకుంట్ల శివ, ఈర్ల మైసయ్య, రామచంద్రం, బత్తుల నర్సింహ, భిక్షపతి పాల్గొన్నారు.