Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ఎమర్జెన్సీ మెడికల్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్
నవ తెలంగాణ-మోత్కూర్
అత్యవసర సేవలైన 108, 102 వాహనాలను ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలనిజిల్లా ఎమర్జెన్సీ మెడికల్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్ అన్నారు. మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని 108, 102 వాహనాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను, మందులు, మెడికల్ ఎక్విప్మెంట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలం చెల్లిన మందులు వాడకుండా జాగ్రత్త పడాలని సూచించారు. మోత్కూర్, గుండాల, అడ్డగూడూర్, ఆత్మకూర్(ఎం) మండలాల ప్రజలు 108 సేవలను వినియోగించుకోవాలన్నారు.ఆయన వెంట108 మోత్కూర్ ఈఎంటీ తొంట భాస్కర్, పైలట్ సైదులు, కెప్టెన్ మహేష్ ఉన్నారు.