Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేశం
నవతెలంగాణ - చౌటుప్పల్ రూరల్
గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించేలా ప్రభుత్వాలు పనిచేయాలని డీివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేష్ కోరారు. సంక్రాంతి సందర్భంగా జై కేసారం గ్రామంలో నిర్వహించిన సంక్రాంతి క్రీడల బహుమతి ప్రధానోత్సవ సభలో పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీి ప్రభుత్వం క్రీడాకారులను పై చిన్న చూపు చూస్తుందని ఆరోపించారు. గ్రామాల్లో మట్టిలో మాణిక్యాలు అనేకమంది ఉన్నారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం యువతను మతం ముసుగులో ముంచి వారి నైపుణ్యాలను తొక్కేస్తుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో యువత డ్రగ్స్ కు బానిసలు కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. యువత మత్తు పానీయాలకు బానిస అవడంతో భవిష్యత్తు నాశనం అవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడా మైదానాలు పేరుకే తప్ప యువతకు ఏమాత్రం ఉపయోగపడటం లేదని అన్నారు. క్రీడమైదానాల్లో క్రీడలకు సంబంధించిన ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూరాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బోడిగే లింగస్వామి, గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రాగిరు కిష్టయ్య, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లె మధు కృష్ణ, కవిడే సురేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పల్లె శివకుమార్, మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు బోదాసు వెంకటేశం, అనిల్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.