Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలలో ప్రజలందరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. మంగళవారం నాడు కలెక్టరేటు సమావేశ మందిరంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో కంటి వెలుగు కార్యక్రమ ఏర్పాట్లను కలెక్టర్ వివరించారు. ఈ నెల 18న ఖమ్మం జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కంటి వెలుగు శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని, 19 న జిల్లాలో ఉదయం 9 గంటలకు కంటి వెలుగు శిబిరాలు ప్రారంభమవుతున్నందున జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, ప్రజలందరూ కంటి వెలుగు శిబిరాలలో కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. గత కంటివెలుగులో జిల్లా జనాభా 8 లక్షల 80 వేల 199 మందికి గాను 18 ఏండ్లు నిండిన నిండిన 6 లక్షల 7 వేల 337 మందికి పరీక్షలు నిర్వహించడం లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ఇందుకోసం జనాభా ప్రాతిపదికగా 34 టీములు, 2 బఫర్ టీముల ఏర్పాటుతో 421 గ్రామాలలో, 104 మున్సిపల్ వార్డులలో మొత్తంగా 525 కంటి వెలుగు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కంటి వెలుగు టీంలో ఒక మెడికల్ ఆఫీసర్, ఒక ఆప్టోమెట్రిస్ట్, ఒక మెడికల్ సూపర్వైజరు, ఒక డేటా ఎంట్రీ ఆపరేటరు, ఇద్దరు ఆశా సిబ్బంది, ఇద్దరు ఎఎన్ఎం. సిబ్బంది ఉంటారని, మండల హెడ్ క్వార్టర్స్ లోనే టీము మెంబర్స్ రాత్రి బస చేస్తారని, రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కేంద్రాలలో పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇప్పటికి 33,400 రీడింగ్ గ్లాసెన్ జిల్లాకు చేరుకున్నాయని, వీటిలో 75 శాతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపడం జరిగిందని, అలాగే కంటి వెలుగు మెటీరియల్ కూడా పి.హెచ్.సి. లకు పంపడం జరిగిందని తెలిపారు. కంటి వెలుగు పరీక్షకు వచ్చే ప్రజలు తమ వెంట ఆధార్ కార్డు తప్పనిసరిగా తెచ్చుకోవాలని ఆమె కోరారు. కంటి వెలుగు కార్యక్రమం సాఫీగా జరిగేందుకు కలెక్టరేట్ కార్యాలయంలో 18004257106, 8685293312 నెంబర్ల ద్వారా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ ప్రెస్ మీట్ లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు దీపక్ తివారీ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సి.హెచ్.కష్ణారెడ్డి, జిల్లా గామీణాభివద్ది అధికారి మందడి ఉపేందర్‌రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ మల్లిఖార్జున రావు, వైద్య అధికారులు పాల్గొన్నారు.
ఈవీఎంల సాప్ట్వేర్ అప్లోడింగ్ పరిశీలన
కలెక్టరేట్ లోని ఈవీఎం గోదాములో జిల్లాకు కొత్తగా వచ్చిన 1808 ఈవీఎం యంత్రాల స్కానింగ్, సాఫ్ట్ వేర్ అప్లోడింగ్ పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ ప్రతినిధి బట్టు రామచంద్రయ్య, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ గిరిధర్, డిప్యూటీ తహసీల్దార్ సురేష్ పాల్గొన్నారు.
25 లోగా డబల్ బెడ్ రూమ్ అర్హుల జాబితాను సమర్పించాలి
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సంబంధించి ఇండ్లు పూర్తయిన గ్రామాలలో గ్రామ సభలను పూర్తి చేసుకొని ఈనెల 25 లోగా తుది అర్హుల జాబితాను సమర్పించాలని జిల్లా కలెక్టరు పమేలా సత్పతి తహశీలుదారులను ఆదేశించారు.మంగళవారం నాడు కాన్ఫరెన్స్ హాలులో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై ఆమె తహశీలుదార్లు, మండల స్పెషల్ ఆఫీసర్స్, ఆర్ అండ్ బి, పంచాయితీ రాజ్ ఇంజనీర్లతో సమీక్షించారు. ఈ సమీక్షలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు దీపక్ తివారీ, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టరు డి శ్రీనివాసరెడ్డి, చౌటుప్పల్ రెవిన్యూ డివిజనల్ అధికారి కె వెంకట ఉపేందర్ రెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్స్ సిపిఓ మాన్యానాయక్, ఎస్సి కార్పొరేషన్ ఈడి శ్యాంసుందర్, జిల్లా సహకార అధికారి పరిమళా దేవి, జిల్లా ఉద్యానవన అధికారి అన్నపూర్ణ, అడిషనల్ డీఆర్డీఏ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ ఎడి, నీలిమ, కలెక్టరేట్ సూపరింటెండెంట్ నాగలక్ష్మి, పంచాయితీరాజ్ డిఇ గిరిధర్, ఆర్అండ్ ఇంజనీరు అలీ, తహసీల్దార్ల్లు శ్యాంసుందర్ రెడ్డి, వీరాబాయి, అశోక్ రెడ్డి, జ్యోతి, జయమ్మ, శ్రీనివాసరెడ్డి, ఎండిఓ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.