Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -బీబీనగర్
మండల కేంద్రంలోని జాతీయ ఉపాధి హామీ చట్టం ద్వారా మంజూరైన 60 లక్షల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు గురువారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిశంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీబీనగర్ పట్టణాన్ని కి మరిన్ని నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పథంలో ముందు ఉంచుతానన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ యెర్కల సుధాకర్ గౌడ్, జడ్పిటిసి గోలిప్రణిత పింగళ్ రెడ్డి , గ్రామ సర్పంచ్ మల్లగారు భాగ్యలక్ష్మి శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఎండి దస్తగిరి, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ బొక్క జైపాల్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ మెట్టు శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు ,తదితరులు పాల్గొన్నారు.