Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉన్న డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం మొదటి సెమిస్టర్ లో పెంచిన పరీక్షా ఫీజులు, వేరియస్ ఫీజులు తగ్గించాలని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బుర్రు అనిల్ వనం రాజు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్లో భువనగిరి పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎంజీయూ పరిధిలో డిగ్రీ ప్రథమ సంవత్సరం సంబంధించిన ఫీజులు గతం కంటే అధికంగా పెంచారన్నారు. యూనివర్సిటీ నిర్ణయించిన ఫీజులు అదేవిధంగా వేరియస్ ఫీజులను విద్యార్థులు కట్టాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. పేద విద్యార్థులు చదువుకునే విధంగా యూనివర్సిటీల ఫీజుల నిర్ణయం ఉండాలి కానీ విద్యార్థులు చదువుకు దూరం చేసే పరిస్థితిని తీసుకురావటం యూనివర్సిటీ అలా వ్యవహరించడం సరికాదని అన్నారు.వెంటనే పెంచిన ఫీజులను తగ్గించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పట్టణ కార్యదర్శి చింతల శివ, ఎస్ఎఫ్ఐ పట్టణ నాయకులు నిలిగొండ వినయ్, తొక్క పురం కార్తీక్ ,భువనగిరి వంశీ, బట్టుపల్లి రాకేష్ పాల్గొన్నారు.