Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -వలిగొండరూరల్
వ్యవసాయ సీజన్ ముగియడంతో వ్యవసాయ కూలీలు పనులు లేక ఖాళీగా ఉంటున్నారని వెంటనే అన్ని గ్రామాల్లోనూ ఉపాధి హామీ పనులను ప్రారంభించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు.గురువారం మండల పరిధిలోని టేకుల సోమవారం గ్రామంలో ఆ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ వరకు వరి నాట్లు ఉండడం వల్ల కూలీలకు పనులు దొరికాయన్నారు. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ ముగియడంతో పనులు లేక ఖాళీగా ఉంటున్నారని వెంటనే ఉపాధి హామీ పనులను ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు దండెం నర్సిరెడ్డి,చేగురి నగేష్, నాయకులు చేగురి పాండు,మాధవి,లక్ష్మమ్మ, ముత్యాలు,సాలమ్మ పాల్గొన్నారు.