Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కపల్లి
రాష్ట్రంలో సంపూర్ణ అంధత్వ నిర్మూలన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించినట్లు దేశంలోనే ఆదర్శవంతమైన పథకమని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, కలెక్టర్ ప్రమేలసత్పతి అన్నారు. గురువారం తుర్కపల్లి మండలం ములకలపల్లి గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పౌరులందరికీ కంటి పరీక్షలు,ఉచితంగా అద్దాలను మందులు,అందజేస్తారని తీవ్రమైన వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తారన్నారు. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 25శాతం మంది ప్రజలకు కంటి సమస్యలతో బాధపడుతున్నారని, శుక్లాలు 43 శాతం, బాల్యంలో అందత్వం నాలుగు శాతం, నెలలు నిండని శిశువులకు నాలుగు శాతం, డయాబెటిస్ రేటినోపతి ఏడు శాతం, చూపు మందగించడం మూడు శాతం,నీటి కాసులు ఏడు శాతం తో బాధపడుతున్నారని, దేశంలో ఎక్కడి లేని విధంగా అనేక సంక్షేమ పథకాల్లో భాగంగా కంటి వెలుగు పథకం ఒకటని,ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని సంపూర్ణ అందత్వ నిర్మూలన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూక్యా సుశీల రవీందర్ నాయక్,జెడ్పి వైస్ చైర్మెన్‌్ బిక్కు నాయక్, మండల స్పెషల్ ఆఫీసర్ జి శ్యాంసుందర్, ఎంపీడీవో నూనె ఉమాదేవి,పిహెచ్సీ డాక్టర్ సుధీర్ రెడ్డి, సర్పంచ్ ఇమ్మడి మల్లప్ప, కంటి వెలుగు ప్రోగ్రాం ఆఫీసర్ వినోద్ , పీఏసీఎస్ చైర్మెన్‌్ సింగిరెడ్డి నరసింహారెడ్డి ,టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్ రెడ్డి ,వైస్ ఎంపీపీ మహాదేవుని శ్రీనివాస్, ఎంపీటీసీ పలుగుల నవీన్ కుమార్ సర్పంచులు పోగుల ఆంజనేయులు వెన్నుకుచ్చి రామ్మోహన్ శర్మ ,కో ఆప్షన్ సభ్యుడు రహమత్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు,పిఎసిఎస్ డైరెక్టర్లు ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ప్రజాప్రతినిధులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు
బీబీనగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత కార్యక్రమంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు ను ప్రజల సద్వినియోగం చేసుకోవాలని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ళ శేఖర్ రెడ్డి అన్నారు, గురువారం నాడు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యెర్కల సుధాకర్ గౌడ్, జెడ్పీటీసీి గోలి ప్రణీత పింగారెడ్డి, స్థానిక సర్పంచ్ మల్ల గారు భాగ్యలక్ష్మి శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ బొక్క జైపాల్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మెన్ మెట్టు శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
రామన్నపేట : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి, జెడ్పిటిసి పున్న లక్ష్మి, గ్రామ సర్పంచ్ గోదాసు శిరీష సూచించారు. గురువారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీపీ, జడ్పిటిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని వారు కోరారు. కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో అవసరమైన వారికి కండ్ల అద్దాలు ఇస్తారని, అవసరమైన వారికి కంటి శస్త్ర చికిత్సలు ఉచితంగా నిర్వహిస్తారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దేశం గర్వించదగ్గ విధంగా ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలలో అత్యంత ముఖ్యమైన ప్రజా ఆరోగ్య పథకమైన కంటి వెలుగు కార్యక్రమంలో కంటి పరీక్షలను చేయించుకుని చూపులు మెరుగుపరుచుకోవాలని స్థానిక సర్పంచ్ గోదాసు శిరీష పథ్విరాజ్ సూచించారు. గురువారం మండల కేంద్రంలో కంటి వెలుగు కార్యక్రమం పై వాల్ పెయింటింగ్ చేయించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమాన్ని మన గ్రామ పంచాయతీ ఆవరణలో మన ఊరి ప్రజల కోసం ప్రారంభమైందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఏటేల్లి సునీత, గొలుసుల ప్రసాద్, కొమ్ము సుస్మిత, లెంకల జ్యోతి, నాయకులు తదితరులు పాల్గొన్నారు
వలిగొండరూరల్ : మండలంలోని పేద ప్రజలు కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ నూతి రమేష్ రాజ్ అన్నారు.గురువారం మండలంలోని దాసిరెడ్డిగూడెం, నెమలి కాల్వ, వేములకొండ గ్రామాలలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సౌకర్యార్థం రెండవ విడత ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్ళఅద్దాలు పంపిణీ చేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎంహెచ్ఓ యశోద, జిల్లా కంటి వెలుగు ప్రోగ్రామ్ అధికారి సుమన్ కళ్యాణ్,జెడ్పిటిసీ వాకిటి పద్మా అనంత రెడ్డి, వైస్ ఎంపిపి బాతరాజు ఉమా బాల్ నర్సింహ, సర్పంచులు కొమిరెల్లి సరితా సంజీవ రెడ్డి, బోళ్ల లలితా శ్రీనివాస్, వంగాల భిక్షపతి, బోడ లక్ష్మీ బాలయ్య,ఎంపిటిసిలు సామ రాం రెడ్డి, నోముల మల్లేష్,ఎంపిడిఓ గీతారెడ్డి,తహశీల్దార్ గణేష్ నాయక్, వైద్యులు రమేష్, నఈమోద్దీన్, తేజస్విని, శాంతి కుమార్, జ్యోతి,మాధవి, అనూష,స్వామి, ఉదరు కిరణ్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గుండాల : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు-2 కార్యక్రమంని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ తాండ్ర అమరావతి శోభన్ అన్నారు.మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం కంటి వెలుగు-2 కార్యక్రమాన్ని అధికారులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య సిబ్బంది సూచించిన విధంగా సమయం ప్రకారం ప్రజలు కంటి వెలుగు శిబిరం వద్దకు వచ్చి కంటి పరీక్షలు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యుడు ఎండి ఖలీల్,మండల ప్రత్యేక అధికారి వెంకటరమణ,మండల వైద్యాధికారి హైమావతి, ఎంపీడీవో జి శ్రీనివాసులు,తహశీల్దార్ జ్యోతి,సర్పంచ్ చిందం వరలక్ష్మి ప్రకాష్,ఎంపీటీసీ కుంచాల సుశీల అంజిరెడ్డి, ఎంపీఓ జనార్దన్ రెడ్డి,మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి షర్ఫోద్దీన్, పంచాయతీ కార్యదర్శులు,వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆలేరురూరల్: 18ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేయించుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని ఆలేరు జెడ్పీటీసీ కుడుదుల నగేష్ అన్నారు. గురువారం మండలంలోని శరాజిపేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని మండల ఎంపీపీ గంగ మల్ల అశోక్ తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, ఎంపీడీవో జ్ఞాన ప్రకాష్ రావు , సర్పంచ్ బండ పద్మ పర్వతాలు ,ఎంపీటీసీ నరేందర్ రెడ్డి ,డాక్టర్ నవీన్ కుమార్ .పంచాయతీ కార్యదర్శి స్వప్న, ఎంపీ ఓ సలీం, మెడికల్ ఆఫీసర్స్ .ఏఎన్ఎం లు. ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని గురువారం మున్సిపల్ పరిధిలోని 1వ వార్డులోని లింగారెడ్డిగూడెంలోని జీఎన్.రెడ్డి గార్డెన్స్ లో మున్సిపల్ ఛైర్మన్ వెన్‌రెడ్డి రాజు ప్రారంభించారు. ప్రజలు కంటి పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి కళ్ల అద్దాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో ఛైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, కౌన్సిలర్లు కోరగోని లింగస్వామి, పోలోజు శ్రీధర్‌బాబు, డాక్టర్ కాటంరాజు, మున్సిపల్ మేనేజర్ వెంకటేశ్వర్లు, నాయకులు తొర్పునూరి మల్లేశ్‌గౌడ్, వెంకటేశ్‌గౌడ్, సందగల్ల సతీశ్, సిబ్బంది పాల్గొన్నారు.
అడ్డగుడూర్ : కంటి వెలుగు కార్యక్రమం కండ్ల సమస్యలు వున్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపిపిదర్శనాల అంజయ్య అన్నారు. మండల పరిధిలోని కొండం పేట గ్రామంలో గురువారం కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ: నిరుపేదలుఅంధకార సమస్యల తో బాధపడకూడదని కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ కిరణ్, ఎంపీడీఓ.చంద్రమౌళి , వైద్య సిబ్బంది టీమ్ డాక్టర్ ఆరాఫ థ్ ,మండల పార్టీ అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి , మండల కో-అప్షన్ అంథోని , గ్రామ సర్పంచి ఇటికాల కుమార స్వామి , ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ప్రవీణ్ కుమార్ , తదితరులు పాల్గొన్నారు.
బొమ్మలరామరం : రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సర్పంచ్ రాంపల్లి మహేష్ గౌడ్, సింగిల్ విండో చైర్మెన్ బాల్ నరసింహ ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పౌరులందరికీ కంటి పరీక్షలు,ఉచితంగా అద్దాలను మందులు,అందజేస్తారని తీవ్రమైన వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సరిత,ఎంపీటీసీ ఈదమ్మ,ఉపసర్పంచ్ జూపల్లి భరత్,మండల వైధ్యాధికారి డాక్టర్ శ్రవణ్ కుమార్, స్పెషల్ ఆఫీసర్ జ్యోతి కుమార్, వైద్యాధికారి డాక్టర్ సుమలత,ఆయుర్వేదిక్ డాక్టర్ క్రాంతి కుమార్,ఆసుపత్రి సిబ్బంది,కంటివేలుగు టీం ,గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
భూదాన్‌పోచంపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు పోచంపల్లి పురపాలక కేంద్ర ప్రజలు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల ప్రజలు కంటి వెలుగును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి అన్నారు. గురువారం 1వ వార్డు కార్యాలయం, ముక్తాపూర్‌లో ఆమె కంటి వెలుగును' ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం పోచంపల్లి పురపాలక పరిధిలోని 13 వార్డులలో, వార్డుకి 4 రోజులు పాటు క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతుందని, 18 సంవత్సరాలు పైబడిన ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్.భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ బాత్క లింగస్వామి, కౌన్సిలర్లు దారెడ్డి మంజుల, కొంగరి కష్ణ, గుండు మధు, సామల మల్లారెడ్డి, దేవరాయ కుమార్, కో ఆప్షన్ నుశ్రత్ సుల్తానా, మెడికల్ ఆఫీసర్ డాపప ఉమరాని, డాపప శ్రీ వాణీ, వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఆలేరుటౌన్ : రెండవ విడత కంటి వెలుగును పట్టణ ప్రజల సద్వినియోగం చేసుకోవాలని పురపాలక సంఘం చైర్మన్ వస్పరి శంకరయ్య అన్నారు. గురువారం స్థానిక పాత ఆర్ అండ్ బి కార్యాలయం ఆవరణలో కంటి వెలుగును కమిషనర్ మారుతీ ప్రసాద్ తో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కంటి వెలుగును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కంటి వెలుగు ఇంచార్జ్ డాక్టర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ 135 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటి వెలుగు డాక్టర్లు డాక్టర్ ఝాన్సీ, డాక్టర్ మనీషా, సూపర్వైజర్లు యాకయ్య, కిష్టయ్య, ఏఎన్ఎం సంతోషి ,విజయలక్ష్మి , సత్యవతి, విజయ, మాధవి, సువర్ణ, వాణి, కళమ్మ, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.