Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నవతెలంగాణ -అర్వపల్లి
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని సూర్యాపేట జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ అన్నారు. గురువారం మండల పరిధిలోని జాజిరిగూడెం గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారని వివరాలను అడిగి తెలుసుకున్నారు ప్రజలకు వృద్ధులకు బాధితులకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలని వసతులను అడిగి తెలుసుకున్నారు బాధితులు వృద్ధులు అధిక సంఖ్యలో వస్తారని వారికి ఇబ్బందులు కలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి వసతులను ఏర్పాటు చేయాలన్నారు . ఈ కార్యక్రమములో తహసిల్దార్ యాదగిరిరెడ్డి ఎంపీడీవో విజయ గారు, వైద్యాధికారులు . మణిదీప్ . మణిరత్నం గారు, సి హే చ్ ఓ చరణ్ , ఎంపీ ఓ సందీప్ హెచ్ ఈ ఓ నర్సయ్య గారు ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు వైద్య సిబ్బంది కార్యకర్తలు పాల్గొన్నారు.