Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా పరిషత్ చైర్పర్సన్ దీపిక యుగంధర్ రావు
నవతెలంగాణ -తుంగతుర్తి
కంటి వెలుగు శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని విజయవంతం చేయాలని సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు అన్నారు.గురువారం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ,మండల పరిధిలోని తూర్పుగూడెం గ్రామంలో కంటి వెలుగు శిబిరాలను ప్రారంభించి మాట్లాడారు. దష్టిలోపాల నివారణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమాలను ప్రారంభించిందన్నారు.శిబిరాల వద్ద సెంటర్ కు వచ్చే వారికి నీడతోపాటు నీళ్ల సదుపాయం కల్పించాలని సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుండగాని కవితా రాములు గౌడ్, ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు,ఎంపీడీవో భీమ్ సింగ్ నాయక్, తహసిల్దార్ రాంప్రసాద్, మండల వైద్యాధికారి డాక్టర్ నాగు నాయక్, స్పెషల్ ఆఫీసర్ వెంకటయ్య, ఎస్ హెచ్ ఓ డేనియల్ కుమార్, తూర్పుగూడెం సర్పంచ్ పూలమ్మ, ఉపసర్పంచ్ గుండగాని మహేందర్ ,పంచాయతీ కార్యదర్శులు భీమా రెడ్డి,నవీన్ కుమార్, హెల్త్ అసిస్టెంట్లు గాజుల సోమయ్య, చారి ,యాదగిరి, ఏఎన్ఎంలు భారతి,జయమ్మ, నాగలక్ష్మి, స్వర్ణలత, ఉమ, శైలజ తదితరులు పాల్గొన్నారు.
అర్వపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రెండో విడత కంటి వెలుగు 18 సంవత్సరాల పైబడిన వారందరూ సద్విని చేసుకోవాలని ఎంపీపీ మన్నె రేణుక లక్ష్మీ నరసయ్య యాదవ్ జెడ్పిటిసి దావుల వీర ప్రసాద్ యాదవ్ మండల కేంద్రంలోని జాజిరెడ్డిగూడెం గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో కంటి వెలుగు కేంద్రం అని ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ యాదగిరి రెడ్డి ఎంపీడీఓ విజయ, సర్పంచ్ కుంభం ఉషారాణి నాగరాజు,సిహేచవో చరణ్ నాయక్ వైద్య సిబ్బందితదితరులు పాల్గొన్నారు.
ప్రజల వద్దకే వైద్యం
ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
నేరేడుచర్ల : కంటి వెలుగు కార్యక్రమం పేదల పాలిట వరమని ,ప్రజల వద్ద నుండి ఒక్క రూపాయి కూడా స్వీకరించకుండా రాష్ట్ర ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహించి వైద్యం అందించే అతి పెద్దపథకం కంటి వెలుగు కార్యక్రమం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గురువారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఇలాంటి పథకం ప్రపంచంలో మరి ఎక్కడ లేదని ప్రజల వద్దకే వైద్యం తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ కే చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయబాబు,కంటి వెలుగు స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ వైద్యాధికారి పున్న నాగిని,శ్రుతి,పుర పాలక కమిషనర్ వెంకటేశ్వర్లు , తహసీల్దార్ సరిత, జెడ్పీటీసీ రాపోలు నరసయ్య, అరిబండి సురేష్ బాబు ఇంజమూరి రాములు తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని పెంచికల్ దిన్న గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీపీ లకుమల్ల జ్యోతి, జెడ్పీటీసీ రామపోలు నర్సయ్య కంటి వెలుగు ప్రత్యేక అధికారి, సూర్యాపేట జిల్లా పంచాయతీ అధికారి యాదయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుంకర వాణి శ్రీరామ్మూర్తి, ఎంపీటీసీ యల్లబోయిన లింగయ్య యాదవ్ ,సింగిల్ విండో చైర్మన్ శాఖమూరి శ్రీకాంత్, సర్పంచులు పల్లెపంగ నాగరాజు ,గంట పెద్ద మల్లారెడ్డి, వాడపల్లి రమణ నగేష్, ఎంపీడీఓ శంకరయ్య ,ఎంపిఓ విజయకుమారి,పెంచికల్దీన్న వైద్యాధికారి సీతామహాలక్ష్మీ, సింగిల్ విండో మాజీ చైర్మన్ మురళి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, గార్లు ఆశ వర్కర్లు ,అంగన్వాడి టీచర్లు గ్రామపంచాయతీ సిబ్బందిలి తదితరులు పాల్గొన్నారు.
తిరుమలగిరి :రెండో కంటి వెలుగు కార్యక్రమాన్ని గురువారం మున్సిపల్ పరిధిలోని నీలిబండ తండలో మున్సిపల్ చైర్ పర్సన్ పోతరాజు రజిని రాజశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదలకు కంటి చూపు ఇవ్వాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కంటి వెలుగు రెండో దశ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ వైస్ చైర్మన్ సంకెపల్లి రఘునందన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీను , మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మినేని స్రవంతి సతీష్ , వార్డ్ కౌన్సిలర్లు భాస్కర్, శ్రీలత , సరిత , ప్రియులత రాము గౌడ్, తొ పాటు వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
చివ్వేంల :కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని కంటి పరీక్షలు చేసుకోవాలని ఎంపీపీ ధరావత్ కుమారి బాబు నాయక్, జెడ్పీటీసీ భూక్య సంజీవ్ నాయక్, వైస్ ఎంపీపీ జూలకంటి జీవన్ రెడ్డి అన్నారు. గురువారం చివ్వేంల, తిరుమలగిరి (జి )గ్రామాలలో ఏర్పాటు చేసిన స్థానిక సర్పంచులతో కలిసి వారు ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ లక్ష్మి, ఎంపీవో గోపి, సర్పంచులు జూలకంటి సుధాకర్ రెడ్డి, కంచర్ల నిర్మల గోవిందరెడ్డి,పంచాయతీ కార్యదర్శులు రజిని, కోటిరెడ్డి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్స్, తదితరులు పాల్గొన్నారు.
నూతనకల్్ : కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ భూ రెడ్డి కళావతి సంజీవరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రం తోపాటు మండల పరిధిలోని మిర్యల గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు దేశానికి వెలుగు నింపుతుందనిన్నారు. ఈ శిబిరంలో పలువురికి కంటి పరీక్షలు చేసి కళ్లద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీం స్పెషల్ ఆఫీసర్స్ డి ఆర్ డి ఏ కిరణ్ కుమార్ జడ్పీ సీఈవో సురేష్ కుమార్ జడ్పిటిసి కందాల దామోదర్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ కనకటి వెంకన్న వైస్ ఎంపీపీ జక్కి పరమేష్ సర్పంచులు కనకటి సునీత తీగల కరుణ శ్రీ గిరిధర్ రెడ్డి స్థానిక ఎంపీటీసీ టు పన్నాల రమ మల్లారెడ్డి ఎమ్మార్వో జమీరుద్దీన్ ఎంపీడీవో ఇందిరా వైద్యాధికారి ఆశ్రీత తారమ్మ మాణిక్యమ్మ జ్యోతి పుష్ప. తో పాటు వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.