Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వజ్రమ్మ పార్థివ దేహం అప్పగింత
నవతెలంగాణ-సూర్యాపేట
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరి రావు తల్లి,తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వజ్రమ్మ బుధవారం మధ్యాహ్నం తన స్వగృహం అయిన కుడ కుడలో తుదిశ్వాస విడిచారు. గురువారం విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్వర్ రెడ్డి, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో పాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు వజ్రమ్మ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అంతిమ యాత్రలో ఆ పార్టీ పార్టీ కార్యకర్తలు, అనుబంధం సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి కళాకారులు తమ ఆట పాటలతో వజ్రమ్మకు తుది వీడ్కోలు పలికారు. వజ్రమ్మ పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులు సూర్యాపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగించారు. కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి జగదీష్ రెడ్డి అభినందించారు. వజ్రమ్మ మృతదేహం వైద్య విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగ పడుతుందన్నారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా. శారద, అనాటమి విభాగాధిపతి కృష్ణయ్య వజ్రమ్మ మృతదేహాన్ని కుటుంబ సభ్యుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి , జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మది వెంకటేశ్వర్లు, బుర్రి శ్రీరాములు, దిరావత్ రవి నాయక్ మట్టి పెళ్లి సైదులు చెరకు ఏక లక్ష్మీ, జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్, జిల్లపల్లి నర్సింహ రావు, కందాల శంకర్ రెడ్డి ,బుర్ర శ్రీనివాస్, నాయకులు వజ్జ శ్రీనివాస్, చెరుకు సత్యం ,రాంబాబు, వెంకట్ నారాయణ ,ఎలిమినేటి రమేష్ వై వెంకటేశ్వర్లు బొమ్మిడి లక్ష్మీనారాయణ, కోడి సైదులు, సుందరి జగన్ ,సుందర్ రావు, మామిడి పుల్లయ్య, సాయికుమార్ ,వీరబోయిన రవి తదితరులు పాల్గొన్నారు.