Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
దేవరకొండ నియోజకవర్గంలోని అంగడిపేటలో బాలికపై గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని బీసీ సంఘం మహిళా నాయకురాలు బంటు కవిత, యాదవ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి చేగొండి మురళీ యాదవ్ డిమాండ్ చేశారు. బీసీ సంఘం ఆధ్వర్యంలో గురువారం స్థానిక అమరవీరుల స్తూపం వద్ద నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. అనంతరం మిర్యాలగూడ పట్టణంలో ఎన్ఎస్పి క్యాంపులో గుర్రంపోడు మండలం మైలవరం గ్రామానికి చెందిన బొంత కావ్య హంతకులను కఠినంగా శిక్షించాలని, కోరుతూ బీసీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జయమ్మ, దుర్గా రమణ,ఫారుక్, బంటు వెంకటేశ్వర్లు, సునీతా రమ్య నాయక్, తదితరులు పాల్గొన్నారు.
దేవరకొండ : పీఏపల్లి మండలం అంగడిపేట స్టేజిలో జరిగిన బాలికపై లైంగికదాడి, హత్య, చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఇన్చార్జి రమావత్ రమేష్ నాయక్, నియోజకవర్గం అధ్యక్షులు ఎర్ర కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
వేములపల్లి : బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఐద్వా, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలో దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి పాదూరి గోవర్ధన శశిధర్రెడ్డి మాట్లాడుతూ రోజురోజుకి బాలికలపై, మహిళలపై లైంగికదాడులు, హత్యలు పెరుగుతున్నాయన్నారు. నిందితుల పట్ల కఠిన వైఖరి చేపట్టకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు పునరావృత్తమవుతున్నాయని చెప్పారు. అధికారులు, పరిపాలన యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. లైంగికదాడి, హత్యలు చేసిన వారిపై కేసులు పెట్టి వెంటనే శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా మండల కార్యదర్శి చెల్లబొట్ల చైతన్య, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పుట్ట సంపత్, కోటేష్, వెంకటేశం, లతీఫ్, రజియా, నరసమ్మ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.