Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించిన గుత్తా, నల్లమోతు
నవతెలంగాణ-మిర్యాలగూడ
అంధులు లేని తెలంగాణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కంటివెలుగు పథకం అమలు చేస్తుందని శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు అన్నారు. రెండో విడత కంటి వెలుగు పథకాన్ని ఎంపీడీఓ కార్యాలయంలోని రైతు వేదిక, బాపూజీ నగర్ వడ్డెర కమ్యూనిటీ హాల్, మండలంలోని వెంకటాద్రిపాలెం గ్రామం నందు గల రైతు వేదికలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కంటి చూపు లేని వారు ఉండకూడదని ఈ పథకాన్ని తీసుకొచ్చినట్టు తెలిపారు. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరికీ కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు, కళ్లద్దాలు అందజేస్తున్నట్టు తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ తిరునగర్ భార్గవ్, వైస్ చైర్మెన్ కుర్ర విష్ణు, ఎంపీపీ నూకల సరళ హనుమంతరెడ్డి, వైస్ ఎంపీపీ అమరావతి సైదులు, కౌన్సిలర్లు, అధికారులు నాయకులు పాల్గొన్నారు.
నల్లగొండ : ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు కంటి సమస్యలను పరిష్కరించేందుకు కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమాన్ని చేపట్టిందని శాసన సభ్యులు కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని గురువారం జిల్లా కేంద్రంలోని స్థానిక 42 వ వార్డు ఆర్టీసీ కాలనీలోని ఐఎంఏ భవన్లో జిల్లా కలెక్టర్ టీ. వినరు కృష్ణారెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించి స్వయంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం శిబిరంలో పరీక్షలు నిర్వహించుకున్న పలువురికి ఆయన రీడింగ్ కళ్ళద్ధాలు, మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడారు. అనంతరం కంటి వెలుగు కార్యక్రమంపై జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ ఏ. కొండల్రావు రచించి, గానం చేసిన పాటను జిల్లా కలెక్టర్ వినరు కృష్ణారెడ్డి తో కలిసి ఎమ్మెల్యే కంచర్ల ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జయ చంద్రారెడ్డి, మునిసిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మెన్ రేగట్టే మల్లిఖార్జున్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవీ. రమణాచారి, మున్సిపల్ వైస్ చైర్మెన్ అబ్బగోని రమేష్ గౌడ్, స్థానిక కౌన్సిలర్, వైద్యారోగ్య సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
దేవరకొండ : సంపూర్ణ అందత్వ నిర్మూలన ప్రభుత్వం లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం పట్టణంలోని ఒకటో వార్డులో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, ఆర్డీఓ గోపి రామ్, మున్సిపల్ వైస్ చైర్మెన్ మహమ్మద్ రహత్ అలీ, సిరందాసు కృష్ణయ్య, పీ.సైదులు, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, జయప్రకాష్ నారాయణ, వైద్యశాఖ అధికారులు శ్రీనివాస్, కృష్ణకుమారి, కమిషనర్ వెంకటయ్య, ఏఈ రాజు, తదితరులు పాల్గొన్నారు. మండలంలోని కొండ భీమనపల్లి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమంలో ఎంపీపీ నల్లగాసు జాన్ యాదవ్, జెడ్పీటీసీ మారుపాకుల అరుణ సురేష్ గౌడ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్‌గౌడ్, గ్రామ సర్పంచ్ మునుకుంట్ల విద్యావతి వెంకటరెడ్డి, ఎంపీడీవో శర్మ, ఏపీవో రామచంద్రం, ఏపీఎం యాదయ్య, డాక్టర్స్, కార్యదర్శులు, వార్డు మెంబర్లు, అంగన్వాడీ టీచర్స్, తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల : కంటి వెలుగు ద్వారా పేద ప్రజల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపుతున్నారని చిట్యాల ఎంపీపీ కొలను సునీత వెంకటేశంగౌడ్ అన్నారు. మండలంలోని వెలిమినేడులో గురువారం ఆ గ్రామ సర్పంచ్ దేశబోయిన మల్లమ్మతో కలిసి కంటి వెలుగు శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దేవరపల్లి సత్తిరెడ్డి, వెలిమినేడు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
నార్కట్‌పల్లి :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు పథకం ప్రపంచంలో ఎక్కడ కూడా కంటి చూపు పై రెండు కోట్ల యాభై లక్షల మందికి పరీక్షలు నిర్వహించిన దాఖలాలు లేవని గిన్నిస్ రికార్డు నమోదు చేసే స్థాయిలో మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమం కొనసాగిందని జిల్లా పరిషత్ చైర్మెన్ బండ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని అక్కనపల్లి గ్రామంలో గ్రామ పంచాయితీ కార్యాలయంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరెందర్ రెడ్డి,వైస్ ఎంపీపీ కల్లూరి యాదగిరి,నార్కెట్‌పల్లి పి ఏ సీ ఎస్ చైర్మెన్ మధుసుధన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్, నక్కలపల్లి ఎంపీటీసీ కనుకు అంజయ్య, సర్పంచులు ఈద మాధవి నర్సింహ్మ, దాసరి రాజు, ఎడమ శేఖర్‌రెడ్డి, మండల నాయకులు కుమార స్వామి, మండల స్పెషల్ ఆఫీసర్ వెంకయ్య,మండల అభివృద్ధి అధికారి యాదగిరి,తహసీల్దార్ మురళి మోహన్, మెడికల్ ఆఫీసర్ అరుంధతి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శ్రీనివాస్ వినరు కుమార్, ఎంపీవో సత్యనారాయణ, పి ఏ సీ ఎస్ చైర్మెన్ ఎల్లారెడ్డిగూడెం సారాశంకర్,నక్కలపల్లి ఉప సర్పంచ్ శ్రీపతి సైదులు ,సత్యనారాయణ, భాషపాక రవి కుమార్, నాయకులు, వైద్య సిబ్బంది ఏ ఎన్ ఎమ్ లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
కంటి వెలుగును సద్వినియం చేసుకోవాలి
ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం నార్కట్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల ఎల్లారెడ్డిగూడెం, కొండపాక గూడెం గ్రామాల్లో కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కల్లూరి యాదగిరిగౌడ్, చెరువుగట్టు ఎంపీటీసీ మేకల రాజిరెడ్డి, స్థానిక సర్పంచ్ మేడి పుష్పలత శంకర్, కొండపాక గూడెం సర్పంచ్ మల్లేష్ , మండల ప్రత్యేక అధికారి వెంకయ్య, వైద్య జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ అరుంధతి, తాసిల్దార్ మురళీమోహన్, ఎంపిడిఓ యాదగిరి, మార్కెట్ వైస్ చైర్మెన్ కొండూరు శంకరయ్య, ఉప సర్పంచ్ వడ్డ భూపాల్ రెడ్డి, మండల వైద్యాధికారి సారా సుల్తానా, వైద్య సిబ్బంది వార్డ్ నెంబర్లు అధికారులు పాల్గొన్నారు.
చిట్యాలటౌన్ : చిట్యాల మున్సిపాలిటీలో కంటి వెలుగు వైద్య శిభిరాన్ని గురువారం మున్సిపల్ చైర్మెన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ జడల ఆదిమల్లయ్య మున్సిపల్ వైస్ చైర్మెన్ కూరెళ్ళ లింగస్వామి, కౌన్సిలర్లు బెల్లి సత్తయ్య, కోనేటి కృష్ణ, పందిరి గీత, జమాండ్ల జయమ్మ , వైద్యాధికారి గట్టు కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రామ్ దుర్గా రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి జిట్టా చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.