Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విలేకరుల సమావేశంలో ఆర్.కృష్ణయ్య
నవతెలంగాణ-నల్లగొండ
కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే జనాభా ప్రాతిపదికన బీసీ కుల గణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంటులో బీసీ బీర్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుండి 52 శాతంకు పెంచాలన్నారు. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలని పేర్కొన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లను కల్పించి ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని అన్నారు. పార్లమెంట్ అసెంబ్లీ సీట్లను 100 శాతం పెంచిన సీట్లను ఇంతవరకు పార్లమెంట్ అసెంబ్లీ గడప తొక్కని బీసీ కులాల వారికి నామినేటెడ్ పద్ధతి మీద ఆంగ్లో ఇండియన్లకు ఇచ్చిన మాదిరిగా నామినేటెడ్ చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలలో ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని అన్నారు. సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జీల నియామకాలలో ఎస్సీ, ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని తెలిపారు. బీసీల విద్య ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్‌ను తొలగించాలని పేర్కొన్నారు. జాతీయ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాలకు విధించిన షరతులను ఎత్తివేసి బీసీ కార్పొరేషన్ బడ్జెట్ వేట 50వేల కోట్లు కేటాయించి అతి కుటుంబానికి 10 లక్షల నుంచి 50 లక్షల వరకు 80శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనరాయణ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపళ్లి అంజి, జిల్లా అధ్యక్షులు అయిత గొని జనార్దన్‌గౌడ్ నీలం వెంకటేష్, పగిలి సతీష్ పగిడి, జిడయ్య కారింగు నరేష్‌గౌడ్, జక్కల మల్లేష్‌యాదవ్, మొగుళ్ల వినోద్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.