Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంద కృష్ణ మాదిగ
నవతెలంగాణ-చిట్యాలటౌన్
అనాధ పిల్లల హక్కుల కోసం ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. చిట్యాల పట్టణ కేంద్రంలోని స్థానిక లక్ష్మీ గార్డెన్లో గురువారం ఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో అనాధ పిల్లల హక్కుల కోసం జనవరి 22న ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులకు వినతి పత్రాలు సమర్పిస్తామని తెలిపారు. జనవరి 23న అన్ని పార్టీల నాయకులతో కలిపి రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. జనవరి 30న హైదరాబాదును మహాదీక్ష కార్యక్రమం చేపడతామని తెలిపారు. అనాధల కోసం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీలు కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశ పెట్టే విధంగా ఒత్తిడి తేవడానికి బీజేపీ నాయకులకు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందజేయాలని, ఎం ఎస్ పి, ఎంఆర్ పీఎస్ కార్యకర్తలను ఈ సందర్భంగా కోరారు. ఫిబ్రవరి 10న జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిని 12 గంటలు దిగ్బంధం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు చిప్పలపల్లి సోమశేఖర్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్, కందుకూరు సోమన్న, మేడి శంకర్ ,జానకి రామయ్య చౌదరి, సందే కార్తీక్, జీడిమెట్ల రవీందర్, గాదే రమేష్, కొత్త వెంకన్న, గురుపాటి కమలమ్మ, పెరిక లింగస్వామి ,ఎరసాని గోపాల్ తదితరులు పాల్గొన్నారు.