Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
నిరుద్యోగ యువతి, యువకులు తమ విద్యకు తగ్గ ఉద్యోగ అవకాశాల కోసం కంటికి కునుకు లేకుండా పోటీ పరీక్షలకు సన్నద్ధవుతున్నారు. ఈ సందర్భంలో వారికి కొన్ని వసతులు, ప్రత్యేకత సదుపాయాలు అవసరం. మిర్యాలగూడ గ్రంధాలయంలో కల్పించడంలో మిర్యాలగూడ ప్రముఖులు, లయన్స్ క్లబ్ సఫలీకృతులయ్యారు. గ్రంథాలయంలో హై స్పీడ్ ఇంటర్నెట్ మోడెం ఒక్కటే ఉంది. దీనివల్ల 600 మంది విద్యార్థులు ఇంటర్నెట్ సదుపాయం ఉపయోగించుకోలేకపోతున్నారు. ఈ విషయాన్ని గ్రంథాలయ నిర్వహకులు లయన్స్ క్లబ్ పిడిజి లయన్ రామానుజాచార్యులు దృష్టికి తీసుకువెళ్లారు. లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో మూడు హై స్పీడ్ మోడెంలను, సుమారు 34 వేల రూపాయల విలువ గలిగిన వాటిని ఏర్పాటు చేశారు. వీటిని బీఎస్ఎన్ఎల్ ఏజీఎం దాసరి అంజయ్య, ఏఈ వెంకటేశ్వర్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరెంటు పోయిన సమయంలో నెట్ ప్రాబ్లం లేకుండా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా యూపీఎస్లను కూడా భవిష్యత్తులో ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కంచర్ల అనంతరెడ్డి, ముక్కుపాటీ వెంకటేశ్వరరావు, పాశం రవీందర్రెడ్డి కోలా సైదులు, పాశం మాధవరెడ్డి, గుండా రామారావు, గుండా రాంబాబు పాల్గొన్నారు.