Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -వలిగొండ రూరల్
మండల పరిధిలోని తుర్కపల్లి నుండి మొగిలిపాక గ్రామం వరకు తుర్కపల్లి నుండి పల్లెర్ల గ్రామం వరకు ఉన్న మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా వెంటనే మార్చి రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని సిపిఐ(ఎం) మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు. శుక్రవారం తుర్కపల్లి గ్రామంలో జరిగిన ఆ పార్టీ శాఖ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుర్కపల్లి నుండి మొగిలిపాక గ్రామం వరకు మూడు కిలోమీటర్ల మేర మట్టి రోడ్డు ఉండడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే తుర్కపల్లి నుండి మొగిలిపాక వరకు బీటీ రోడ్డును నిర్మాణం చేపట్టాలని అదేవిధంగా తుర్కపల్లి నుండి పల్లెర్ల వరకు మూడు కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు మెరుగు వెంకటేశం, శాఖ కార్యదర్శి ఉప సర్పంచ్ వెల్మకన్నె బాలరాజు పాల్గొని మాట్లాడారునాయకులు మాజీ సర్పంచ్ సల్ల ఐలయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పలుసం స్వామి,తుమ్మల సంజీవరెడ్డి,నర్సిరెడ్డి, బొక్క వెంకటరెడ్డి,సల్ల రాజయ్య, వనం మురళి తదితరులు పాల్గొన్నారు.