Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండో విడత చేపట్టిన కంటి వెలుగు ప్రోగ్రాం విజయవంతనికి వైద్యులు ,సిబ్బంది కృషి చేయాలని యాదాద్రి డివిజన్ కంటి వెలుగు ప్రోగ్రాం అధికారి డాక్టర్ పాపారావు అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం కంటి వెలుగు ప్రోగ్రాంను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిహెచ్ నాగేష్ తో కలిసి యంత్ర పరికరాలు, దగ్గర చూపు కండ్లద్దాలను పంపిణీని పరిశీలించారు . కంటి వెలుగు ఇంచార్జ్ డాక్టర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ పురుషుల 62 స్త్రీలు 71 మొత్తం 133 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రములో కంటి వెలుగు డాక్టర్లు డాక్టర్ మనీషా, డాక్టర్ ఝాన్సీ , సూపర్వైజర్లు యాకయ్య, కిష్టయ్య, ఏఎన్ఎం సంతోషి ,విజయలక్ష్మి , సత్యవతి, విజయ, మాధవి, సువర్ణ, వాణి, కళమ్మ, పాములపర్తి రామచంద్రారెడ్డి, ఆలేటి లింగం, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.