Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
భువనగిరి పురపాలక సంఘం అవుట్సోర్సింగ్ కార్మికుల నియామకంలో జరిగిన అక్రమాలపై, కమిషనర్‌పై విచారణ జరిపించాలని కోరుతూ కాంగ్రెస్ కౌన్సిలర్లు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర కమిషనర్ .సంచాలకులు పురపాలక పరిపాలన శాఖ అధికారి డాక్టర్ వి. సత్యనారాయణ కి ఆర్డిఎంఏ శ్రీనివాసరెడ్డి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్‌కుమార్, 26వ వార్డు కౌన్సిలర్ ఈరపాక నరసింహ, 23వ వార్డు కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ మాట్లాడుతూ 189 మంది దరఖాస్తులు చేసుకోగా వాళ్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మున్సిపల్ కమిషనర్ ఇష్టానుసారంగా 28 మందిని రిక్రూట్మెంట్ చేశారన్నారు. మున్సిపల్ కమిషనర్ కార్మికులను తామే రిక్రూట్మెంట్ చేసుకుంటామని జిల్లా కలెక్టర్ కి చెప్పి ఎంప్లాయిమెంట్ ఆఫీస్ నుండి వచ్చిన దరఖాస్తులన్నీ తీసుకొచ్చారన్నారు. దరఖాస్తు చేసుకున్న 189 మందికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కమిషనర్ ఏకపక్షంగా 28 మందిని రిక్రూమెంట్ చేసుకున్నారన్నారు. ఆల్ఫా అవుట్సోర్సింగ్ ఏజెన్సీ కాంట్రాక్టర్ లెటర్ తీసుకొని కాంట్రాక్టర్ కు కూడా సంబంధం లేకుండా కమిషనర్ 28 మంది పేర్లు ప్రకటించారన్నారు. ఆ 28 మంది కార్మికులలో కూడా రాయగిరి గ్రామానికి సంబంధించిన ఏడుగురు ఒకే కుటుంబానికి చెందిన వారన్నారు. కమిషనర్ ఇష్టానుసారంగా రిక్రూట్మెంట్ చేసుకున్న 28 మంది పైన తగు విచారణ జరపాలని డిమాండ్‌చేశారు.
ఆల్ఫా అవుట్సోర్సింగ్ ఏజెన్సీ కాంట్రాక్ట్ ను వెంటనే రద్దుపరిచి తిరిగి టెండర్ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు.