Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
రాత్రిపూట పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి, దొంగతనాలను అరికట్టాలని గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం భువనగిరి అధ్యక్ష, కార్యదర్శులు దేవునురి బాలయ్య, పాక జహంగీర్, జిల్లా కమిటీ సభ్యులు ర్యాకల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈనెల 16 వ 3 మేక పొతులు, ఈ నెల 18వ తేదీన 5 మేకపోతులు భువనగిరి మండలం తాజ్ పూర్ గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం చేశారు. శుక్రవారం గొర్రెల కాపరి గులాని నర్సింహా మంద వద్దకు వారు వెళ్లి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట మండలాల్లో గొర్రెల దొంగతనాలను అరికట్టేందుకు పోలీసు శాఖ వారు రాత్రిపూట పోలీస్తుీ పెట్రోలింగ్ పెంచి దొంగతనాలు జరగకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోమన బాలయ్య, బిట్టుకూరి లక్ష్మన్, బిట్టుకూరి బాలరాజు, వార్డు మెంబర్ నగేష్ బాల్డ రవి , గులాని నరసింహ,రాములమ్మ, అశోక్ ,శశి పాల్గొన్నారు.