Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భువనగిరి
భువనగిరి మండలం బోల్లేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో జరుగుతున్న నందనం కంటి వెలుగు శిబిరాన్ని శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మల్లికార్జున్ రావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అంధత్వ నివారణ తెలంగాణకు ప్రతి ఒక్కరు కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రశాంత్ బొల్లెపల్లి వైద్యాధికారి డాక్టర్ యామిని, కంటి వెలుగు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కాంచన, ఆప్టోమెట్రిస్ట్ సాయి ప్రసన్న హెల్త్ సూపర్వైజర్ లో నవీన్, ప్రఫుల్ల,హెల్త్ అసిస్టెంట్ సురేష్ వినోద సబిత సునంద ,డేటా ఎంట్ర ఆపరేటర్ సుగుణ , ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.