Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలా సత్పతి
నవ తెలంగాణ -భువనగిరి రూరల్
జిల్లాలో 14,750 ఎపిక్ కార్డులు పోస్ట్ ఆఫీస్ల ద్వారా డిస్టిబ్యూషన్ చేయడం జరుగుతున్నదని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టి రవికిరణ్ తో కలిసి శుక్రవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జాతీయ ఓటరు దినోత్సవం, ఫోటో సిమిలరీ ఎంట్రీలు, ఓటర్ ఎపిక్ కార్డుల జారీ, ఆధార్ అనుసంధానం ప్రక్రియలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి వివరిస్తూ, జిల్లాలో 14,750 ఎపిక్ కార్డులు పోస్ట్ ఆఫీస్ ల ద్వారా డిస్టిబ్యూషన్ చేయడం జరుగుతున్నదని తెలిపారు. జిల్లాలో ఫోటో సిమిలరీ ఎంట్రీలు సంబంధించి 14,259 గుర్తించామన్నారు. వాటి వెరిఫికేషన్ జరుగుతున్నదని తెలిపారు. వచ్చే మార్చి లోగా ఆధార్ లింకేజీ వంద శాతం పూర్తి చేయనున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి, భువనగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి ఎం వి భూపాల్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మందడి ఉపేందర్ రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ గిరిధర్, డిప్యూటీ తహసిల్దార్ సురేష్ బాబు పాల్గొన్నారు.