Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
నల్లగొండ జిల్లా గ్రంధాలయ సంస్థ సాధారణ సర్వ సభ్య సమావేశం జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యాలయంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మెన్ రేగట్టే మల్లికార్జునరెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో 2023 - 24 సంవత్సరంకు 6 కోట్ల 66 లక్షల బడ్జెట్ అంచనాలు ఆమోదించారు. భవన నిర్మాణాలు, స్వీపర్ చార్జీల పెంపు విషయం చర్చించి ఆమోదించారు. ఈ సమావేశంలో పాలక వర్గ సభ్యులు డీపీఆర్ఓ శ్రీనివాస్, వయోజన విద్యాశాఖ కార్యాలయ అధికారి నర్సింహరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయ సెక్టోరల్ అధికారి రాంచందర్, నల్లగొండ డివిజనల్ పంచాయతీ అధికారి లక్ష్మి నారాయణ, జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి బాలమ్మలు పాల్గొని చర్చించిన అంశాలపై తీర్మానం చేసి ఆమోదించారు. ఈ సమావేశంలో కార్యాలయ సిబ్బంది నర్సింహరెడ్డి, రాజేశ్, శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.