Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
560 జీవోను వెంటనే అమలు చేయాలని తెలంగాణ కళ్ళు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ సూపర్డెంట్ కార్యాలయంలో కల్లుగీత కార్మిక సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని గీత కార్మికులందరికీ ఉపాధి కలిగే విధంగాచర్యలు చేపట్టాలని, వృత్తిలో ప్రమాదాలు జరగకుండా మరణాలు సంభవించకుండా చూడాలని కోరారు. అందుకోసం ఆధునిక పరికరాలు ఇవ్వాలని, మారుతున్న పరిస్థితులు కనుగొనంగా వృత్తిలో మార్పులు తీసుకురావాలని కోరారు. 2021-2022 బడ్జెట్లో కేటాయించిన డబ్బులు తాడి కార్పొరేషన్‌కు ఇవ్వాలని సేఫ్టీ మోకుద్విచక్ర వాహనాలు తదితర సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కల్లుగీతా కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగాని సీతారాములు, జిల్లా అధ్యక్షులు కొండా వెంకన్న, జిల్లా గౌరవాధ్యక్షులు పానుగుల్ల అచ్చాలు, జిల్లా ఉపాధ్యక్షులు వేములకొండ పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.