Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సత్యవతి రాథోడ్‌కు వినతి
నవతెలంగాణ-మిర్యాలగూడ
జిల్లా గిరిజన సంక్షేమ కార్యాలయంలో పనిచేస్తున్న అవినీతి ఏవోను సస్పెండ్ చేయాలని భారత విద్యార్ధి పేడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యావతి రాథోడ్‌కు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ నల్లగొండ గిరిజన సంక్షేమ కార్యాలయంలో ఏవోగా విధులు నిర్వహిస్తున్న ఎండీ. జాఫర్ కలెక్టర్ కార్యాలయంలో అవినీతి అక్రమాలకు కేరప్ అడ్రస్‌గా మారారని ఆరోపించారు. తక్షణమే అతనిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలలో సరిపడా ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్న నేపథ్యంతో గిరిజన ఆశ్రమ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా వాలంటీర్లను నియమించింది. ఆతను ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా విద్యా వాలంటరీల నియామకంలో సీనియార్టీ పాటించకుండా డబ్బులకు ఆశపడి డబ్బులు తీసుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఓవర్టేక్ చేస్తున్న ఏవోపైచర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి బలమైన ఉద్యమాలు నిర్మిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి కుర్ర సైదానాయక్, దామరచర్ల మండల కార్యదర్శి థీరవత్ వీరన్న, ఉపేందర్, రవి, మంగ్తా నాయక్ తదితరులు పాల్గొన్నారు.