Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూర్
మున్సిపల్ కేంద్రమైన మోత్కూరు కేంద్రంగా నియోజకవర్గంతో పాటు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ కోరారు.ప్రయివేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం మోత్కూరు వచ్చిన ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతకుమారి సెక్రెటరీ కె.విద్యాసాగర్‌కు బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు రామన్నపేట, నేడు తుంగతుర్తి ఈనియోజకవర్గంలో పెద్ద మండలమైన మోత్కూరు మున్సిపాలిటీగా ఏర్పడినప్పటికీ ఆశించిన అభివృద్ధి జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో జరిగే నియోజకవర్గాల పెంపులో అడ్డగూడూరు, ఆత్మకూరు (ఎం) గుండాల, మోటకొండూరు మండలాలను కలిపి మోత్కూరును నియోజక వర్గంగా ఏర్పాటు చేయడంతో పాటు రెవెన్యూ డివిజన్ చేయాలని కోరారు.రెండు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని సెక్రటరీ టు సీఎస్ విద్యాసాగర్ హామీ ఇచ్చారని తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నిలిగొండ మత్స్యగిరి, చంద్రశేఖర్, యాకేశ్ పాల్గొన్నారు.