Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరిరూరల్
భువనగిరి మండలం బొల్లేపల్లి గ్రామంలో 1977-78 బ్యాచ్‌కు చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అప్పటి ఉపాధ్యాయులు నర్సయ్య, సత్యనారాయణ, ఎంఏ జాఫర్, రవీందర్‌రెడ్డిలు పాల్గొని మాట్లాడారు.విద్యార్థులు చిన్నతనంలో చేసిన అల్లరి చేష్టలను నెమరేసుకున్నారు.గతంలో గురువులు అంటే భయం భక్తి ఉండేవని ప్రస్తుతం లేవన్నారు.పూర్వ విద్యార్థులు గోదా నరేందర్ గౌడ్, ఎం.జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో చేసిన అల్లరి చిల్లర చేష్టలను గుర్తు చేసుకున్నారు.గతంలో గురువు చెప్పిన విద్యతో తాము ఈ స్థాయిలో ఉన్నామని గర్వంగా చెప్పుకున్నారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు బాలకృష్ణ, అయ్యన్న గౌడ్, నిరంజన్‌రెడ్డి, చంద్రయ్య, పద్మారెడ్డి, ఇందిరా, టి.ఉమా, ఎం.సుమతి పాల్గొన్నారు.