Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరిరూరల్
బస్వాపూర్ రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న బీఎన్ తిమ్మాపూర్ భూ నిర్వాసితులు రిజర్వాయర్ కట్టపై రిలే నిరాహారదీక్షలు ఆదివారం నాటికి 55 వ రోజుకు చేరుకున్నాయి.ఈ సందర్భంగా భువనగిరి మాజీ పీఏసీఎస్ చైర్మెన్ ఎడ్ల సత్తిరెడ్డి మాట్లాడుతూ మా గ్రామంలో ఉన్న భూ నిర్వాసితులకు అందరికీ భూముల నష్టపరిహారం ఒకేసారి చెల్లించాలని కోరారు.గ్రామంలో ఉన్న అందరికీ ప్యాకేజీ అందించి, హుస్నాబాద్‌లో ఏర్పాటవుతున్న ప్లాట్లు త్వరగా కేటాయించి ఇండ్లు నిర్మించుకోవడానికి అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇదివరకు మా గ్రామ రైతులు అందరికీ భూముల నష్టపరిహారం వేస్తామని చెప్పి అధికారులు జనరల్ అవార్డు ప్రకటించడం జరిగిందనీ, అందులో కొందరికి మాత్రమే భూముల నష్టపరిహారం అందించా రన్నారు. నష్టపరిహారం రాని రైతులకు పాత జనరల్ అవార్డు తొలగించి, కొత్త అవార్డును ప్రకటించి మాకు భూముల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్ర మంలో జూపల్లి దేవేందర్, ఎంపీటీసీ ఉడుత శారదా ఆంజ నేయులుయాదవ్, మాజీ సర్పంచ్ రావుల అనురాధ నందు, వార్డు సభ్యులు వళ్ళందస్ పరమేష్, జిన్న నర్సింహ, దొంకేనసాయి, ఉడుత శ్రీశైలం, జూపల్లి శివ, పిన్నంబాబు, పిన్నంరాజు, జిన్ననవీన్, జంగిటి నరేష్, బాషపల్లి రాజు, అన్నెపు భాను, కుసుమ శివ కుచుల విగేష్ ఎండి శానుర్ జిన్న రాంబాబు లు పాల్గొన్నారు.