Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
ప్రముఖ ఇట్రాడ్ సేవా సంస్థ సోచ్ వారి నుండి ఏకశిలా పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ ఇందిరా ఉపేందర్‌రెడ్డి విధూషన్ పురస్కారాన్ని అందు కున్నారు.30 ఏండ్లుగా విద్యారంగంలో అనేకమంది విద్యార్థులను తీర్చిదిద్ది ఉత్తమపౌరులను సమాజానికి అందించడంతో వీరి విశిష్ట సేవలను గుర్తించి ఇట్రాడ్ సేవా సంస్థ సోచ్ హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా ఇందిరా ఉపేందర్‌రెడ్డి దంపతులకు విధూషన్ పుర స్కారాన్ని అందుకున్నారు.ఈసందర్భంగా పలువురు ప్రముఖులు వారికి విధూషన్ అవార్డు రావడం పట్ల అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జేడీ లక్ష్మీనారాయణ, చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు గంగరాజన్, ఇట్రాడ్ సోచ్ సంస్థ అధ్యక్షుడు మధుకర్‌రెడ్డి, రెడ్‌క్రాస్ సంస్థ చైర్మెన్ దాస భీంరెడ్డి, ప్రముఖ కూచిపూడి నృత్య శిక్షకురాలు పద్మశ్రీ పద్మజారెడ్డి పాల్గొన్నారు.