Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కపల్లి
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన స్కాలర్షిప్లు, ఫీజురీయీంబర్స్మెంట్ విడుదలచేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు డిమాండ్ చేశారు.ఆదివారం మండలకేంద్రంలోని రవీందర్రెడ్డి భవనంలో నిర్వహించిన ఎస్ఎఫ్ఐ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికీ సుమారు రూ.4000 కోట్లు స్కాలర్షిప్లు, ఫీజురీయీంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయన్నారు.రెండేండ్లుగా పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజురీయీంబర్స్మెంట్ విడుదల కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.కళాశాల యాజమాన్యాలు స్కాలర్షిప్లు చెల్లిస్తేనే సర్టిఫికెట్లను ఇస్తామని తేల్చి చెబుతున్నారన్నారు.ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు లావుడియారాజు, జిల్లా సహాయ కార్యదర్శి చింతలశివ, మండలనాయకులు అఖిల్ పాల్గొన్నారు.