Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రామన్నపేట
మండలంలోని కక్కిరేణి గ్రామంలో ఆదివారం కౌలు రైతుల సమస్యలపై రైతు సంఘం ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి, సభ్యత్వ నమోదు చేశారు.ఈ సందర్భంగా రైతు సంఘం మండల అధ్యక్షులు గన్నెబోయిన విజయభాస్కర్ మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితులలో కౌలురైతులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కుంటు న్నారన్నారు.కౌలు రైతులకు ప్రభుత్వాల నుండి ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదన్నారు.వారికి ప్రభుత్వం ద్వారా రుణం, రైతూబీమా సౌకర్యం, గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కోశాధికారి వేముల సైదులు, రైతుసంఘం గ్రామ అధ్యక్ష కార్యదర్శులు కన్నెబోయిన యాదయ్య, తరాల నర్సింహ, చింతల నరేందర్, మహేందర్, నర్సింహ, సైదులు, చెన్నయ్య, మల్లేష్, బుర్ర శంకర్, దుర్గమ్మ, అండాలు, వినోద తదితరులు పాల్గొన్నారు.